English   

నాని-సుధీర్ బాబుల మల్టీస్టారర్...భలే టైటిల్ !

nanisudheerbabu
2019-03-31 12:35:23

నాని కథానాయకుడిగా పరిచయమయిన సినిమా అష్టా చమ్మా, ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి నానితో తర్వాతి రోజుల్లో జెంటిల్ మేన్ కూడా తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి సమ్మోహనం కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలతో ఒక మల్టీ స్టారర్ మూవీ చేయడానికి ఇంద్రగంటి మోహనకృష్ణ ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ అధికారిగా క‌నిపించ‌నుండ‌గా, నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని అంటున్నారు. దిల్ రాజు-నాని ఇద్దరూ కలిసి నిర్మించ‌నున్న ఈ సినిమాకు మణిశర్మని సంగీత దర్శకుడిగా ఎంపిక చేయ‌నున్న‌ట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాకి వ్యూహం అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో వున్నట్టుగా కూడా ఫిలిం నగర్ వర్గాల సమాచారం.  నాని ఒకపక్కన  విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు.

More Related Stories