English   

హీరోగా మారునున్న సన్నాఫ్ కీరవాణి !

Music director mm keeravani son simha turning hero
2019-03-31 13:46:49

రాజకీయాల్లో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ వారసుల రాక కొత్త విషయమేమీ కాదు, అయితే వారసులు వచ్చినా వారిలో విషయం లేకుంటే మాత్రం ఫేడవుట్ అవడం ఖాయం. అయితే అలా వారిలో విషయం ఉందొ లేదో తెలుసుకోవాలి కాబట్టి ఒక ట్రైల్ వేస్తూ ఉంటారు. అలాగే తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్దమవుతున్నాడు కీరవాణి కుమారుడు. అబ్బా అదేంటి కీరవాణి గారబ్బాయి సింగర్ కదా అనుకుంటున్నారు కదా, ఇప్పుడు విషయం ఆయన గురించి కాదు ఆయన రెండో కొడుకు గురించి. ఆయన రెండో కుమారుడు శ్రీ సింహా ఇప్పటికే రంగస్థలం సినిమాలో అసిస్టంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే,

దీంతో అందరూ ఆయన డైరెక్షన్ విభాగంలో ఉన్నాడు కాబట్టి డైరెక్టర్ అవుతాడేమో అని భావిస్తున్న్ తరుణంలో ఆయన నటన వైపు మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు. హీరోగా చేయాలని భావిస్తున్నాడని, ఓ కొత్త దర్శకుడి సినిమాలో నటించబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌, ఇతర క్యారెక్టర్లు గురించి త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు. 

More Related Stories