English   

మన్మధుడులో బ్రహ్మీ కనిపించడా ?

Vennela kishore in Brahmanandam role in Manmadhudu 2
2019-03-31 14:25:16

కొన్ని సినిమాలు ఉంటాయి ఎన్ని సార్లు చూసినా అసలు బోర్ కొట్టవు, అలాంటి వాటిలో ఉన్న ఒక సినిమా మన్మధుడు, తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగార్జున సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన రకుల్ ప్రీత్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. మన్మధుడు అనగానే గుర్తు వచ్చేది లవంగంగా బ్రాహ్మీ పండించిన కామెడీ, నాగార్జున, సోనాలీ , బ్రాహ్మీ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ క్లాసిక్ కామెడీ సీన్స్ గా మిగిలిపోయాయి.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండో భాగంలో బ్రహ్మీ నటించడం లేదట. అయితే ఆయన స్థానంలో నేటి కమెడియన్స్ లో టాప్ లో త్రెందింగ్ లో ఉన్న వెన్నెల కిషోర్ నటిస్తున్నాడట. ఏప్రిల్‌లో పోర్చుగల్‌ లో మొదలు కాఉన్న మొదటి షెడ్యూల్‌ లో ఈయన కూడా ఉంటారని అంటున్నారు. ఈయనను సినిమాలో సన్నాఫ్ లవంగంగా చూపిస్తారని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

More Related Stories