English   

అప్పుడే విడాకుల దాకా వచ్చిందా ?

Priyanka Chopra and Nick Jonas Are Heading for a Divorce
2019-03-31 14:44:20

నేటి సమాజంలో అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ లు ఉంటున్నాయి, ఆఖరికి ప్రేమలు పెళ్ళిళ్ళ విషయంలో కూడా, ఇది సామాన్యులలో కంటే సెలెబ్రిటీలలో కొంచెం ఎక్కువే కనిపిస్తుంది. అయితే అసలు విషయానికి వస్తే గత ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా, బ్రిటన్ వ్యక్తి నిక్ జోనాస్ ల విడాకుల గురించి అప్పుడే వార్తలు వస్తున్నాయి. ఒక అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం ప్రియాంక, నిక్ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారట. నిజానికి నిక్ కంటే ప్రియాంక పెద్దది, అయినా ప్రేమ ముందు ఇవన్నీ చిన్న విషయాలే కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు.

అయితే ఇప్పుడు ప్రియాంక ధోరణి నిక్ కి నచ్చట్లేదని, ఆమె మారుతుందని భావించినా ఎంతకీ మార్కాపోవడంతో విడాకుల గురించి ఆలోచిస్తున్నారని ఆ కధనం పేర్కొంది. అయితే ఈ వార్తని ప్రియాంక ప్రతినిధి ఖండించారు. కానీ ఇంతవరకూ ప్రియాంక.. నిక్ లు ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రస్తుతం ప్రియాంక, నిక్ లాస్ ఏంజెల్స్ లో నివసిస్తున్నారు. 

More Related Stories