English   

వైసీపీలో చేరనున్న జీవిత రాజశేఖర్ !

Jeevitha-Rajasekhar
2019-04-01 01:59:58

గతంలో వైసీపీ అధినేత జగన్ వెంట నడిచి అభిప్రాయ బేధాలు వచ్చి బయటకు వచ్చిన వారంతా నెమ్మదిగా ఈయన వెంట నడుస్తున్నారు. ఇప్పటికే దాడి వీర భద్ర రావు, రఘురామ కృష్ణం రాజు వంటి వారు ఆ లిస్ట్ లో చేరగా తాజాగా సినీనటులు జీవిత, ఆమె భర్త, హీరో రాజశేఖర్ లు కూడా వైసీపీలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు వారు జగన్ అపాయింట్మెంట్ కోరారు. అన్నీ కుదిరితే  వారు ఈరోజే పార్టీలో చేరే అవకాశం ఉంది. ప్రజారాజ్యం నుండి రాజకీయం మొదలు పెట్టిన ఈ దంపతులు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీజేపీలో చేరాక జీవితకు సెన్సార్ బోర్డు సభ్యురాలి పదవి కూడా దక్కింది. అయితే ఏపీలో ఈసారి జగన్ సీఎం అవుతాడని అనేక సర్వేలు చెబుతున్న నేపధ్యంలోనే వీరు మళ్ళీ జగన్ గూటికి వెలుతున్నారని అంటున్నారు. గతంలో జగన్ దగ్గర తమకు అవమానం జరిగిందని ఇద్దరూ అనేక సందర్భాల్లో బాహాటంగానే విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ జగన్ దగ్గరకు వెళ్ళడానికి గల కారణాలు ఏమిటో ? మరి.

More Related Stories