English   

డెడ్ లైన్ ఫిక్స్ చేసిన చరణ్...ఆలోపల అవ్వాల్సిందేనట !

Ram-Charan
2019-04-01 03:29:23

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. ఈ చిత్ర నిర్మాతగా మాంచి సక్సెస్ సాధించిన రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రెండో సినిమాగా తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి.  ఈ సినిమా మీద టాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాలో సౌత్ ఇండియా స్టార్ హీరోలతో పాటు, బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమితాబచ్చన్ కూడా కీలక పాత్రలో నటించాడు. దీంతో ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో దసరాకి రిలీజ్ చేయాలనే భావనలో నిర్మాత రామ్ చరణ్ ఉన్నాడు. అయితే షూట్ శరవేగంగా జరుగుతున్నా రీషూట్స్ వలన సినిమా ఆలస్యం అవుతుందట. ఈ విషయాన్ని గమనించిన చరణ్  మే 5వ తేదీకి షూట్ పూర్తి చేయాలని దర్శకత్వ విభాగానికి డెడ్ లైన్ పెట్టారట. ప్రస్తుతం కోకాపేట్ లో వేసిన భారీ కోట సెట్స్ లో షెడ్యూల్ కి రెడీ అవుతుంది యూనిట్.  ఏప్రిల్ 9న కొత్త షెడ్యూల్ కోసం మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు.  చూడాలి మరి చరణ్ డేడ్ లైన్ అయినా పని చేస్తుందో లేదో ?

More Related Stories