English   

దేవరకొండ తమ్ముడు హీరోగా సినిమా...మేనమామ ప్రొడక్షన్ !

Anand-Devarakonda
2019-04-01 06:55:05

వారసులని తెరంగ్రేటం చేయించడం కొత్తేమీ కాదు, తాజాగా మరో వారసుడు తెరంగ్రేటం చేయడానికి రెడీ అయ్యాడు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా సిద్దమవుతోంది. తెలంగాణా గడీల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఒక ప్రేమకథా చిత్రంతో ఆయన హీరోగా పరిచయమవుతున్నారు. ఆనంద్ హీరోగా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం దొరసాని. ఈ చిత్రం ద్వారా కె.వి.ఆర్. మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ మీద మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ గంగినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై రాశారు. అచ్చమైన తెలంగాణ భాషా సంస్కృతుల్ని ఈ చిత్రంలో చూపించనున్నారని అంటున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూరుస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు. అయితే ఈ నిర్మాతల్లో ఒకరయిన యష్ రంగినేని ఎవరో కాదు పెళ్లి చూపులు సినిమాకి నిర్మాత విజయ్, ఆనంద్ లకి స్వయానా మేనమామ

More Related Stories