English   

వైసీపీకి సినీ గ్లామర్ ఉపయోగపడుతుందా ?

YSR-Congress
2019-04-01 09:45:07

సినిమాలకూ రాజకీయాలకు దక్షిణాదిలో అవినాభావ సంబంధం ఉంది. తెలుగు విషయానికి వస్తే.. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా సినీ జనం ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కొన్నాళ్లుగా వైసీపీలోకి సినీ నటుల రాక జోరు పెరిగింది.  ఇటీవలే ఆ పార్టీలో చేరిన సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ అలియాస్ పీవీపీ విజయవాడ బరిలో ఉన్నారు. మరికొందరు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వైసీపీ తరపున గట్టిగా పోరాడుతున్నారు. కమెడియన్ అలీ మూడు పార్టీలతో సంప్రదింపులు జరిపి చివరకు వైసీపీ వైపే మొగ్గారు.  ఇక వీరే కాకుండా జయసుధ, రాజా రవీంద్ర, దాసరి అరుణ్‌, హీరో భానుచందర్‌, నటుడు కృష్ణుడు వైసీపీలోనే ఉన్నారు. రైటర్ కమ్ యాక్టర్ పోసాని కృష్ణమురళి కూడా వైసీపీ కోసం గట్టిగానే కృషి చేస్తున్నారు. అయితే వీరికి తోడు ఈరోజు ఎప్పుఒ వైసీపీ నుండి వెళ్ళిపోయినా జీవిత్జా రాజశేఖర్ లు మళ్ళీ చేరారు. వారితో పాటు యాంకర్ శ్యామల, ఆయన భర్త కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు వీరందరినీ వైసీపీలో చేర్చుకుని జగన్ ఏమి లాభపడతారు అనేది పరిశీలిస్తే, ఇదంతా ఒక మైండ్ గేం అని చెబుతున్నారు. నిజానికి వీరిలో ఎవరికీ ఏపీలో వోటు హక్కు లేదు, కానీ వైసీపీ వైపే సినిమా ఇండస్ట్రీ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు విశ్లేషకులు. వీరు ప్రచారం మాత్రమే చేయగలరు అని అంటున్నారు. మరి వీరంతా వైసీపీ విజయానికి ఏమాత్రం కష్టపడతారో చూడాలి.

More Related Stories