English   

ప్రభాస్ సినిమాకి లవ్లీ టైటిల్...హైదరాబాద్ లోనేనట !

Prabhas
2019-04-01 10:40:06

రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు సాహో షూట్ తో పాటు ఈ సినిమా షూట్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ సినిమాని ప్రభాస్ పెదనాన్నకి చెందిన గోపీకృష్ణ ప్రొడక్షన్స్ తన ఫ్రెండ్స్ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య ప్రారంభోత్సవం జరుపుకున్న  ఈ సినిమా మొదటి షెడ్యూల్  ఇటలీలోని మిలాన్‌లో చేశారు. పీరియాడిక్‌  రోమాంటిక్ లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగనున్న సినిమా కావడంతో 1970  నాటి లుక్‌ వచ్చేలా  రోమ్ నగరాన్ని హైదరాబాద్‌లో మళ్ళీ సృష్టిస్తున్నారని అంటున్నారు. ఈ సెట్స్‌లో సినిమా టర్న్ చేసే సీన్స్‌తో పాటు, ఫైట్స్ ఎపిసోడ్స్ కూడా చిత్రీకరిస్తారని సమాచారం. భారీ సినిమా కావడంతో దీనికి ఆర్ట్ డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ ఎక్కువే పడుతుండట. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కోసం 18 సెట్లు రెడీ చేస్తున్నారట. ప్రభాస్ మార్కెట్ దృష్టిలో పెట్టుకోని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నారు.  ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

More Related Stories