English   

ఐషూ డైరెక్షన్ కి వేళాయేరా !

Aishwarya-Rai
2019-04-01 10:51:51

మాజీ ప్రపంచ సుందరి, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యా రాయ్ త్వరలోనే మెగా ఫోన్ పట్టనున్నట్టు చెబుతున్నారు. ఆ మధ్య త్వరలో డైరెక్షన్ చేయనున్నట్టు మీడియాతో చెప్పుకున్న ఆమె. కరెక్ట్ టైమ్ చూసుకుని ఈ సినిమాకి సంబంధించి తక్కిన డీటేల్స్ ని అనౌన్స్ చేస్తానని కూడా చెప్పింది. మోడలింగ్ సహా, నటనలో మంచి పేరుతెచ్చుకున్న ఐష్ ఇప్పటికే ప్రొడక్షన్‌కు సంబంధించిన అన్ని విషయాల మీద అవగాహన తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు దర్శకత్వం శాఖలో రాణించాలని చూస్తుందని అంటున్నారు. అయితే ఆమె డైరెక్ట్ చేసేది ఏ సినిమా అనేది త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. ఆమెకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమె సినిమా తీస్తే అంచనాలు భారీగానే ఉంటాయి, మరి ఐషూ  సినిమా ఏ జానర్ లో ఉంటుంది, ఆమె ఎవరెవరిని మెయిన్ లీడ్స్ గా తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories