English   

వర్మకి మొట్టికాయలు వేసిన సుప్రీం !

Lakshmi's NTR Producer files Petition in Supreme Court
2019-04-01 13:02:51

ఏపీ రాజకీయాల్లో సంచలనాలు రేపిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. తెలంగాణ రాష్ట్రంలో సహా ఏపీ మినహా వరల్డ్ మొత్తం విడుదలైన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్సే వస్తున్నాయి. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 3వ తేదీ వరకు ఏపీలో ప్రదర్శించడానికి వీలు లేదన అక్కడి హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. హైకోర్టు స్టే విధింపుపై నిర్మాత రాకేష్‌రెడ్డి ఈరోజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

అయితే ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సినిమాను విడుదల చేయాలని, తమ పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలని చేసిన నిర్మాత రాకేష్ రెడ్డి పిటిషన్‌‌ను చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ ధర్మాసనం తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ఈ పిటిషన్ ను డిస్ మిస్ చేస్తూ, ఏప్రిల్ 3న హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకూ ఎందుకు ఆగరని ప్రశ్నించారు. హైకోర్టే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని, అక్కడ వ్యతిరేక నిర్ణయం వస్తే అప్పుడు తమను ఆశ్రయించాలని తీర్పునిచ్చారు.

More Related Stories