English   

మజిలీ మూవీ రివ్యూ !

Majili-Review
2019-04-05 16:26:05

అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్ హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మజిలీ’ శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌లోనూ పలుచోట్ల విడుదలైంది. ఈ సినిమా మొదలయిన నాటి నుండే ఈ సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం పెళ్లి అయ్యాక మొగుడు పెళ్ళాలు కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇద్జే కావడం. ఇక సినిమా తాలూకా టీజర్స్ ట్రైలర్స్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి, మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో తెలియాలంటే రివ్యూ చదవాల్సించే. 

 కధ :

పూర్ణ (నాగచైతన్య) ఐటీఐ చదువే టీనేజ్ కుర్రాడు. తండ్రి టీటీఈ కావడంతో ఎలాగైన రైల్వేస్‌ టీమ్‌లో క్రికెటర్‌గా స్థానం సంపాదించాలని తడనతఃరం నేషనల్స్ దాకా ఎదగాలని లక్ష్యం పెట్టుకుని ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. అలా క్రికెట్ కోసం చేసిన ఒక దొంగతనం కారణంగా పరిచయం అయిన అన్షు (దివ్యాంశ కౌశిక్‌)తో పూర్ణ ప్రేమలో పడతాడు. కానీ పెద్దలు వారి ప్రేమకు అడ్డు చెప్తారు. అన్షును తన పేరెంట్స్ పూర్ణకు దూరంగా తీసుకెళ్లిపోతారు. అన్షు దూరమైందన్న బాధలో పూర్ణ కెరీర్‌ను కూడా వదిలేసి దేవదాసులా తయారవుతాడు. ఆ సమయంలో పూర్ణ శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తండ్రి కోసం పెళ్లి చేసుకున్నా ఏ రోజూ శ్రావణిని కనీసం మనిషిగా కూడా గుర్తించడు. కానీ శ్రావణి మాత్రం తన భర్త ఏ రోజుకైనా మారతాడన్న నమ్మకంతో ఉంటుంది. అనుకోకుండా పెళ్లి దాకా వెళ్ళిన చైతన్య సమంతల జీవిత మజిలీనే ఈ సినిమా కధ.

విశ్లేషణ : 

నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివ నిర్వాణ మరోసారి అలాంటి ఎమోషనల్‌ లవ్ స్టోరీనే ప్లాట్ ఫాంగా తీసుకున్నాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్ జోలికి పోకుండా తను అనుకున్న కథను చెప్పే ప్రయత్నం చేశాడు. కథనం కాస్త నిన్నుకోరి తరహాలోనే అనిపించినా ప్రేక్షకుడి కంట కన్నీరు తెప్పించే విషయంలో మరోసారి సక్సెస్‌ అయ్యాడు. ఫస్ట్ హాఫ్‌ చైతూ, దివ్యాంశల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు, ఫ్రెండ్స్‌ తో కలిసి చైతూ చేసే అల్లరితో సరదాగా నడిపించిన దర్శకుడు, సెకం‍డ్‌ హాఫ్ మొత్తం ఎమోషనల్‌ బేస్ మీదే కథ నడిపించాడు. అయితే అక్కడక్కడా కథనం నెమ్మదించటం ప్రేక్షకులను కాస్త ఆసక్తిని తగ్గిస్తుంది.

నటీనటులు సాంకేతక వర్గం విషయానికి వస్తే ముందుగా హీరోగా నాగచైతన్య గురించి మాట్లాడాలి. ఈయన ప్రతీ సినిమాకు నటుడిగా పరిణతి సాదిస్తున్నాడు. ఈ సినిమాలో రెండు భిన్న కోణాలున్న పాత్రలో బాగా నటించాడు. ఇక టాలీవుడ్ లో మొదటి సినిమా అయినా దివ్యాంశ కౌశిక్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్‌లో ఎంట్రీ ఇచ్చిన సమంత తన అద్భుత నటనతో మిగతా అందరినీ డామినేట్ చేసేసింది. మిగతా పాత్రల్లో రావూ రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, అతుల్‌ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక పాటల విషయానిక వస్తే గోపి సుందర్‌ అందించిన పాటలు కథలో భాగం వచ్చిపోతూ అలరిస్తాయి. తమన్‌ తన నేపథ్య సంగీతంతో సీన్స్‌ను మరో స్ధాయికి తీసుకెళ్లాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా : చైతన్య జీవిత మజిలీలో భార్యతో కలిసి మొదటి హిట్టు మజిలీతో కొట్టాడు.

రేటింగ్: 3/5

More Related Stories