English   

మోహన్ బాబునే బెదిరిస్తున్నారట !

Mohan-Babu
2019-04-05 16:43:15

నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారికి మోహన్ బాబు అంటే భయం, ఆయన క్రమశిక్షణ వలనో ఇంకేమో తెలియదు కానీ ఆయన అంటే చాలా అండి హడలి పోతూ ఉంటారు. అలాంటి సినీ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్‌బాబుకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయట. ఎవరో తెలియని అజ్ఞాత వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఇటీవలే వైసీపీలో చేరారు. అయితే, వైసీపీలో తాను చేరినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. గత నెల 26న తన ఫోన్ నెంబర్ కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఈ బెదిరింపు కాల్స్ విదేశాల నుంచి మోహన్ బాబుకు వచ్చినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. ఈ ఫోన్ లు గత నెల 22న రాత్రి 30కి పైగా ఫోన్‌లు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అమెరికాలోని సియోటెల్‌, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా నుంచి 22న అర్ధరాత్రి ఈ బెదిరింపు కాల్స్‌ వచ్చాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. తదుపరి విచారణ నిమిత్తం న్యాయ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నారు పోలీసులు. ఈ ఎన్నికల్లో ఆయన  వైసీపీ తరపున ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు.

More Related Stories