English   

బండ్ల గణేష్ రాజకీయ సన్యాసం !

ganesh
2019-04-06 07:22:33

సినీ ఇండస్ట్రీ నుండి రాజకీయాల వైపు మళ్ళిన వారిలో తెలుగు నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తన సొంత ఊరు ఉన్న రాజేంద్రనగర్‌, లేదా సినిమా వాళ్ళు ఎక్కువ ఉన్న జూబ్లీహిల్స్‌ లలో ఏదో ఒక టికెట్‌ వస్తుందని ఆయన ఆశలు పెట్టుకోగా నిరాశ ఎదురయ్యింది. ఓదార్పు కోసం ఆయన్ని కాంగ్రెస్ తమ అధికార ప్రతినిధిగా నియమించింది. కాంగ్రెస్ గెలవకుంటే బ్లేడ్ తో గొంతు కోసుకున్తానన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడటంతో పార్టీ కార్యక్రమాలు, రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.


 తాజాగా ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్‌లో తన నిర్ణయాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించిన నేతలకు గణేష్ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తన విమర్శలు, వ్యాఖ్యల వల్ల ఎవరినయినా బాధపెట్టి ఉంటె  పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నానని అయన పేర్కొన్నారు. 

More Related Stories