English   

పవన్ కు అస్వస్థత...బొక్క బోర్లా పడిపోయారు !

pk
2019-04-06 07:33:27

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ తీవ్రమైన ఎండలో ప్రచారం చేయడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది. విజయనగరం పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న పవన్‌ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు వైద్యులు సూచించారు. 


ఈ క్రమంలో ఈరోజు జరగాల్సిన సత్తెనపల్లి, తెనాలి జనసేన ఎన్నికల శంఖారావం సభలను ప్రచారాన్ని పవన్‌ రద్దు చేసుకున్నారు. ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపటి నుంచి ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు సెలైన్ పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోపక్క  విజయనగరంలో పవన్ సభలో ప్రసంగించేందుకు సన్నద్ధమవుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని పవన్ కాళ్ళ మీద ఒక్క ఉదుటున పడడంతో పవన్ కిందపడిపోయారు. ఈ ఘటనలో మైక్ కూడా విరిగిపోయింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పవన్ పడిపోవడానికి కారణమైన అభిమానిని బయటకు లాగి పోలీసులకు అప్పగించారు.  

More Related Stories