English   

ఆర్ఆర్ఆర్ కి బ్రేక్...కొడుకు సినిమా సెట్లో రాజమౌళి ! 

rajamouli
2019-04-06 07:42:50

రాజమౌళి చేసే ప్రతి సినిమాలోనూ అతని కుమారుడు కార్తికేయ నిర్మాణ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కొందరు సన్నిహితుల సినిమాలు చూసుకునే కార్తికేయ ఇప్పుడు స్వయంగా పూర్తిస్థాయి నిర్మాతగా మారాడు. ఆయన స్వయంగా ఆకాశవాణి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని రాజమౌళి వద్ద దర్శకత్వ విభాగంలో  సహాయకుడిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు డైరెక్ట్ చేస్తున్నాడు.  జనవరి నుండి మొదలయిన ఈ సినిమాలో సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నాడట. 


తాజాగా సముద్రఖని తన ట్విట్టర్‌లో రాజమౌళితో కలిసి దిగిన ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటో ఆకాశవాణి సెట్‌లో దిగినట్టు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చరణ్ కి గాయం కావడం వలన ఆ షూట్ కి బ్రేక్ పడింది సో ఖాళీగా ఉన్న రాజమౌళి వైజాగ్ లో ఆకాశవాణి షూటింగ్ స్పాట్‌కి వెళ్లారట. ఆ సమయంలో జక్కన్న, సముద్రఖని కలిసి ఫోటో దిగగా ఆ ఫొటోనే ఇప్పుడ సోషల్ మీడియాలో షేర్ చేశారని అంటున్నారు. ఒక వైపు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సముద్రఖని చిత్రంలో నటిస్తూ మరో వైపు కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో కూడా మెప్పించానున్నాడు. ఇక ఈ సినిమాకు కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
 

More Related Stories