English   

ఉగాది గిఫ్ట్ ఇవ్వనున్న వెంకీ మామ !

venkymama
2019-04-06 07:51:49

నిజజీవిత మామా అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్యలు రీల్ మామా అల్లుళ్ళుగా నటిస్తున్న సినిమా వెంకీ మామ. లవకుశ ఫేం రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మొదట ప్రకటించినప్పుడు అందరూ లైట్ తీసుకున్నారు. ఇది కూడా సాధారణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు విడుఅలయిన సినిమా లోగో సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది, ఇప్పటి వరకూ సిన్మా గురించి కొన్ని పుకార్లు వచ్చాయి. చైతూ మిలిటరీలో పనిచేస్తాడని పుకార్లు వినిపించాయి.

వాటిని నిజం చేసేలా ఉందీ పోస్టర్ ఒకపక్క కొనసేమ పల్లెటూరు మరోపక్క యుద్ద భూమిని చూపుతూ ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ‘వెంకీమామ’ అనే టైటిల్ చుట్టూ 12 రాశుల గుర్తుల్ని ఉంచారు. దీంతో ఈ సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. అలాగే రేపు ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తోంది సినిమా యూనిట్. రేపు ఉదయం ఏడూ గంటల రేడు నిముషాలకి ఈ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

More Related Stories