English   

సినిమా పిచ్చోళ్ళ కోసం నవదీప్ చిరుప్రయత్నం !

Allu-Arjun
2019-04-06 11:30:52

సినిమా అంటేనే మాయా ప్రపంచం అనుకునే రోజుల నుండీ సినిమా కూడా ఒక ఉపాధి, కళకు ప్రతిరూపం అనే రోజులకి వచ్చాం. సినిమా వాళ్ళంటే ఒకప్పుడు జనాల్లో చులకన భావన ఉండేది కానీ కాల క్రమేణా అది తగ్గుతూ రావడంతో సినిమా వైపు వస్తున్న వారి సంఖా కూడా గణనీయంగా పెరుగుతోంది. తాజాగా అలా వస్తున్న ఔత్శాహికుల కోసం నటుడు నవదీప్ ఒక ప్రయత్నం చేస్తున్నాడు.  అదే’సీ – స్పేస్'(కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్) సెంటర్. జూబ్లీహిల్స్ రోడ్ నెం .47లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ను ఉగాది రోజున అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు. టాలెంట్ ఉండి దానిని సరిగా వాడుకోలేని వారి కోసం ఈ సెంటర్ ను ఏర్పాటు చేస్తునట్టు చెబుతున్నారు. బయట కాఫీ షాపుల్లో, స్టూడియోల చుట్టూ తిరిగేందుకు పెట్టే డబ్బుకంటే తక్కువ మొత్తంతో ఇక్కడ అనేక విషయాలు తెలుసుకుని టాలెంట్ నిరూపించుకోవచ్చని నవదీప్ చెబుతున్నాడు.  రేపు ఉగాది సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెం .47లో ఈ వేదికను అల్లు అర్జున్ ఓపెన్ చేయనున్నారు.

More Related Stories