English   

మజిలీ ఫస్ట్ డే కలెక్షన్స్ !

majili
2019-04-06 15:44:05

నాగచైతన్య సమంతాలు జంటగా నటించిన ‘మజిలీ’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా మొదటి ఆట నుండే పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. నాగచైతన్య రెండు విభిన్నమైన గెటప్స్‌ మరియు వేరియేషన్స్‌తో అలరించిన ఈ సినిమాలో సమంత నటనతో అదరకొట్టింది. రొటీన్ కధే అయినా ప్రెజెంట్ చేసిన విధానం నచ్చడంతో ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నారు. ఈ చిత్రం అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది.  ఈ సినిమాతో పాటు పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో మజిలీని భారీ ఎత్తున రిలీజ్ చేశారు. 

ఒక్క నైజాం ఏరియాలో మొదటి రోజు ఈ సినిమా రూ.1.94 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.  చైతన్య కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు.  ఇక వరసగా చూస్తే వైజాగ్‌ : 76 లక్షలు, ఈస్ట్‌ : 28 లక్షలు, వెస్ట్‌ : 27 లక్షలు. కృష్ణ : 37 లక్షలు, గుంటూరు : 67 లక్షలు, నెల్లూరు : 18 లక్షలు, సీడెడ్‌ : 75 లక్షలు, యూఎస్‌ : 88 లక్షలు, కర్ణాటక : 73 లక్షలు, మిగతావి : 25 లక్షలు అలా మొదటి రోజు ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి 11.5 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను, 7.08 కోట్ల షేర్‌ను రాబట్టింది.

More Related Stories