English   

నందమూరి అభిమానులకి షాక్ ఇచ్చిన జక్కన్న !

British actress Daisy Edgar Jones backs out of RRR.
2019-04-07 07:12:26

మెగా హీరో చరణ్, నందమూరి వారసుడు ఎన్టీఆర్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. బహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన రాజమౌళి ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ఈ ముగ్గురూ కలవడం అంటేనే అదో రకమైన క్రేజ్ కావడంతో ఈ సినిమా మీద మొదటి నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకే రోజుకొక పుకారు వస్తూ ఉండేది. ఈ గోల అంతా ఎందుకు అనుకున్న జక్కన్న గత నెలలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మారీ ఈ సినిమా లైన్ అలాగే మెయిన్ లీడ్స్ గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ స్టేజ్ ఆర్టిస్ట్ డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నట్ట్టు ప్రకటించారు. దీంతో ఒక రకంగా నందమూరి అభిమానులు సంతోషంగా ఫీల్ అయ్యారు. తారక్ పక్కన హాలీవుడ్ భామ ఉందని వారు అలా ఫీల్ అయ్యారు. అయితే వారికి షాక్ ఇచ్చేలా ఒక ప్రకటన విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా నుండి కొన్ని అనివార్య కారణాల వలన ఆ భామ తప్పుకుంటుందని ఆ ప్రకటన సారాంశం. అయితే ఆమె తప్పుకుంటున్నట్టు ప్రకటించారు కానీ కారణాలు ఏమీ మేన్షన్ చేయలేదు. కానీ ఆమె కుటుంబ కారణాల వలన సినిమా నుండి తప్పుకుంటుందని చెబుతున్నారు, మరి ఎన్టీఆర్ సరసన ఇంకెవరు నటిస్తారో ?

More Related Stories