English   

బంగారు బుల్లోడు ఫస్ట్ లుక్ రిలీజ్ !

bangaru bullodu first look poster released
2019-04-07 07:21:37

కామెడీ సినిమాలు అనగానే టక్కున గుర్తొచ్చే అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న 55వ సినిమా బంగారు బుల్లోడు. పి.వి.గిరి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నరేష్ లుక్ ఆసక్తికరంగా ఉంది. మెడలో వడ్డాణం అంత బంగారంతో ఈ మెరిసిపోతున్నాడు నరేష్. ఇక ఈ సినిమాలో పూజా జవేరి హీరోయిన్‌గా నటిస్తోందని అంటున్నారు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నరేష్ కి హిట్ తేవడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. షూట్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అంటున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని ఈ వేసవిలోనే విడుదల చేయడానికి చూస్తున్నారు మేకర్స్. అన్నట్టు బంగారు బుల్లోడు పేరుతో నందమూరి బాలకృష్ణకి ఒక హిట్ ఉన్న సంగతి తెలిసిందే.

More Related Stories