English   

మహర్షి టీజర్ టాక్ !

maheshbabu
2019-04-07 07:31:18

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే కథానాయికగా అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మహేశ్ కెరీర్లో 25 మూవీ కావడంతో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకక్కించారు.  ఈ ఉగాది సందర్భంగా సందర్భంగా యూనిట్ మహేశ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ అందించింది. ఉదయం 9.09 గంటలకు మహర్షి టీజర్‌ను రిలీజ్ చేశారు.  1.19 సెకన్ల నిడివివున్న ఈ టీజర్ వీడియోలో మహేశ్ ను, చాలా స్టయిలిష్ గా చూపించారు.

ఆయన పాత్ర పేరు రిషికుమార్ కాగా, మల్టీ బిలియనీర్ గా అమెరికాలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద చాపర్ లో మహేశ్ దిగడంతో టీజర్ మొదలవుతుంది. ఆపై "రిషికుమార్ సక్సెస్ స్టోరీ ఇక్కడితో ఆగిపోయినట్టేనా?" అని మీడియా అడగగా "సక్సెస్ లో పుల్ స్టాప్స్ ఉండవు. కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ" అన్న డైలాగ్, "నాకో ప్రాబ్లమ్ ఉంది సార్... ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే... గెలిచి చూపించడం నాకు అలవాటు" అన్న డైలాగులు మరింత అంచనాలు పెంచుతోంది. టీజర్ విడుదలైన నిమిషాల వ్యవధిలోనే దీని వ్యూస్ మూడు మిలయన్ వ్యూస్ కి వెళ్ళింది. ఈ టీజర్ ను మీరూ చూడండి.

 

More Related Stories