English   

సుకుమార్ రౌడీ అట...చార్మీ ఇంటరెస్టింగ్ ట్వీట్ !

sukumar
2019-04-07 07:46:45

వరుస ప్లాఫులతో సతమతమవుతున్న డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ అంతే రరేంజ్ లో సక్సెస్‌ కోసం మొహం వాచి ఎదురుచుస్తున్న హీరో రామ్‌తో కలిసి ఇస్మార్ట్‌ శంకర్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. యుద్ద ప్రాతిపదికన షూటింగ్‌ను పూర్తి చేస్తున్న పూరి. ఈ సినిమాని సమ్మర్ ఆఖరికి రిలీజ్ చేయాలని చుస్తున్నాడు. ఈ మధ్యనే గోవా షెడ్యూల్ అవగోట్టిన యూనిట్ ప్రస్తుతం హైదరాబద్ లో దిమాక్‌ ఖరాబ్‌ అనే సాంగ్‌ ను షూట్‌ చేస్తోంది. ఈ పాట చిత్రీకరణ సమయంలో టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సెట్ లో హంగామా చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ తో సుక్కు సరదాగా ముచ్చటించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలను చార్మీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘రౌడీ గారు.. సుకుమార్‌.. లొకేషన్‌కు రావడంతో ఎంతో సరదాగా ఉంది. థ్యాంక్స్‌ ఫర్‌ ఆల్‌ కాంప్లీమెంట్స్‌’ అంటూ చార్మీ ట్వీట్‌ చేసింది. అయితే ఇక్కడ చార్మీ సుకుమార్ రౌడీ అనడం కాస్త ఆశ్చర్యకరంగా మారింది. 

More Related Stories