English   

మొన్న టీడీపీ ప్రచారంలో...నిన్న క్లారిటీ ఇవ్వడంలో !

nikhil
2019-04-07 07:58:36

ఏపీలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి పార్టీలు. ప్రచారానికి ఐదు రోజుల సమయమే ఉండటంతో సినిమా స్టార్లను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ తరపున సీమ జిల్లాల్లో హీరో మొన్న హీరో నిఖిల్ ప్రచారం చేశారు. కర్నూలు జిల్లా డోన్, పత్తికొండతో పాటూ పలు నియోజకవర్గాల్లో గురువారం నాడు పర్యటించారు. అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. అయితే మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో కానీ తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల గురించి క్లారిటీ ఇవ్వడానికి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

 తనకి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదని, ఎవ్వరికీ, ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని తన ఫ్యామిలీ మెంబర్ అయిన కె.ఈ. ప్రతాప్‌ డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఆయన మంచి వ్యక్తి కావడంతో ఆయనకు విశెష్ చెప్పడం అలాగే అక్కడున్న లోకల్ వాళ్లతో మా అంకుల్‌కి ఓటు వేయమని ప్రచారం చేయడం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఆయన చాలా మంచి మనిషి అని ఆ ఏరియాకు ఆయన ఎన్నో మంచి పనులు చేశాడని అందుకే ధైర్యంగా ప్రచారం చేశానని చెప్పుకొచ్చాడు. తనకు తెలిసిన చాలా మంది మంచి వ్యక్తులు పోటీ చేస్తున్నారని వాళ్లందరికీ సపోర్ట్ చేస్తానని వాళ్లు ఏ పార్టీలో వ్యక్తులైనా సరే సంబంధము లేదని కాంగ్రెస్సో, టీడీపీయో, వైఎస్సార్‌సీపీయో, జనసేనో, బీజేపీనో, ఇండిపెండింటో అనేది సంబంధం లేదని వారి కోసం ఒక యువకుడిగా ప్రచారం చేస్తానని ఆయన పేర్కొన్నాడు.

More Related Stories