English   

జనసేన ప్రచారానికి బన్నీ హ్యాండ్ ఇచ్చినట్టే !

Allu Arjun Not To Campaign for Janasena
2019-04-07 08:31:21

అల్లు అర్జున్, వరుణ్ తేజ్ నాగబాబు తరపున నర్సాపురంలో ప్రచారం చేస్తారని నాగబాబు సతీమణి పద్మజ ఇటీవలే ప్రకటించారన్న విషయం తెలిసిందే. విదేశాల నుంచి తిరిగొచ్చిన వరుణ్ తేజ్ శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ తాను పాల్గొనడం లేదని అల్లు అర్జున్ ఒక లేఖ ద్వారా వెల్లడించారు. తాను ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ తన మద్దతు, తన అభిమానుల మద్దతు నాగబాబుకు, జనసేనకు ఉంటుందని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. నిన్న ఒక లేఖను ట్వీట్ చేసిన బన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయం తీసుకున్న నాగబాబు గారికి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

రాజకీయ ప్రయాణంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఎన్నికల ప్రచారంలో ఫిజికల్‌గా మేం మీతో ఉండకపోవచ్చు కానీ మానసికంగా మాత్రం ఎప్పుడూ మీతోనే ఉంటామని మా మద్దతు మీకు ఎప్పటికీ ఉంటుందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌కు, జనసేన పార్టీకి కూడా ఆయన మద్దతు తెలిపారు. జనసేన రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నానని ఆ లేఖలో అల్లు అర్జున్ పేర్కొన్నారు. 

More Related Stories