English   

చిత్రలహరి ట్రైలర్ రివ్యూ !

sai-dharam-tej
2019-04-08 08:28:31

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా సినిమా చిత్రలహరి. ఎన్నో సినిమాలు ఫ్లాప్ లు కాగా ఈ సినిమా మీద ఆయన ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఈనెల 12న అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ఈ మెగా హీరో. ఈ చిత్రంలో తేజ్ సరసన కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లు నటించారు. ‘నేను శైలజ’ దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ఇంకా వారమే టై ఉండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో.. ‘నా పేరు విజయ్ నా పేరులో ఉన్న విజయం నా జీవితంలోకి ఎప్పుడొస్తుందో అని వెయిటింగ్’ అంటూ ఈ చిత్రంలో తన పాత్ర ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఇక ఈ సినిమాలో అయన డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. తన లైఫ్ ఏంటి, ఎవరెవరు తన జీవితంలో ఉన్నారు ? తన కెరీర్ ఏంటి ? త గోల్ ఏంటి అనే విషయాలని ఈ ట్రైలర్ లో చూచాయగా చూపాడు దర్శకుడు.   ‘ఒకే దిక్కున ఉదయించే సూర్యుడు నాలుగు దిక్కులు ఉదయించినా ఇంత వెలుతురు కూడా రాని జీవితం నాది. ఎందుకంటే చీకటికి చిరునామా నేను..’ లాంటి డైలాగ్స్ అయితే సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి. చూడాలి మరి ఈ సినిమా అయినా తేజూకి హిట్ ఇస్తుందో లేదో ?

More Related Stories