English   

దిల్ రాజుతో బన్నీ ఐకాన్...కనబడుటలేదట !

 Allu-Arjun
2019-04-08 08:54:41

పుకార్లన్నీ నిజమయ్యాయి, స్టైలిష్ స్టార్ గా ప్రాచుర్యం పొందిన అల్లు అర్జున్ గతేడాది చేసిన ఏకైక సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ ఎఫెక్ట్ తో భారీ గ్యాప్ తీసుకున్న బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్‌ తో ఒక సినిమా, తనకు ఆర్య లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నా సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకి  స్క్రిప్టు కూడా దాదాపు అయిపోయింది. ఇక సినిమా సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం. ఈ లోగా మరో సినిమాను బన్నీ లైన్ లో పెట్టేశాడు. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరాం చెప్పిన ఒక లైన్ నచ్చడంతో బన్నీ ఈ సినిమాకి ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి, వాటిని నిజం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించేసింది. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ప్రకటనతో పాటు టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఐకాన్ అనే టైటిల్‌ ను తో వస్తున్న ఈ సినిమాకి  కనబడుట లేదు అనేది ట్యాగ్ లైన్. రచన, దర్శకత్వం శ్రీరాం వేణు అని  నిర్మాత దిల్ రాజు అనే విషయాలు తప్ప ఇంకే వివరాలను వెల్లడించలేదు. ‘హ్యాపీ బర్త్‌డే AA’ అంటూ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు.  

More Related Stories