English   

అభిమానిని వెంటపడి మరీ కొట్టిన బాలయ్య !

Balakrishna
2019-04-08 09:24:20

ప్రతిసారి తన అభిమానుల మీద చెయ్యి చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కే నందమూరి బాలకృష్ణ మరో మరు అదే కారణంతో వార్తల్లోకి ఎక్కాడు. ఈ ఎన్నికల ప్రచారంలో ఇప్పటి దాకా పెద్దగా చెయ్యి చేసుకోకపోయినా నోటి దురుసు వలన వార్తల్లోకి ఎక్కిన బాలయ్య ఇప్పుడు మాత్రం ఏకంగా ఒక వ్యక్తిని కొడుతూ ఉండడం తీవ్ర చర్చనీయాంశం అయింది.  విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలయ్య నడిరోడ్డుపై అందరూ చేస్తుండగానే ఓ యువకుడి మీద దాడి చేశారు. బాలయ్య వెంటపడుతుంటే, ఆ యువకుడు పరిగెత్తాడు. కానీ బాలయ్య అతడి వెంట పరిగెత్తి మరీ దాడి చేశాడు. అయితే ఈ వీడియో అస్పష్టంగా ఉంది. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను బట్టి బాలయ్య అనే ప్రచారం జరుగుతోంది కానీ నిజంగా దాడి చేసింది బాలయ్యేనా లేదా మరో వ్యక్తి అనేది స్పష్టంగా తెలియడం లేదు.  బాలయ్య అభిమానులపై దాడి చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లో ఆయన అతి చేసిన ఫ్యాన్స్‌ చెంప చెల్లుమనిపించారు.  
 

More Related Stories