English   

పవన్ ని పరామర్శించిన చరణ్ !

 Ram-Charan-Tej
2019-04-08 10:12:06

ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ ని రామ్ చరణ్ పరామర్శించారు. విజయవాడలోని పవన్ నివాసానికి వెళ్లిన చరణ్ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. పవన్ చాలా బలహీనంగా ఉన్నారన్న చరణ్ వేడి తీవ్రంగా ఉండటంతో ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని డాక్టర్లు సూచించారు. కానీ పవన్ వారి మాట వినకుండా ప్రచారం నిర్వహించడానికే మొగ్గు చూపుతున్నారని చరణ్ తెలిపారు. ప్రచారం గడువు త్వరలోనే ముగుస్తున్న కారణంగా ఇవాళఅనకాపల్లి, పెందుర్తిలలో ప్రచారం నిర్వహించాలని పవన్ నిర్ణయించుకున్నారని చరణ్ పేర్కొన్నాడు. వైద్య నిపుణుల బృందాన్ని వెంట వస్తామన్నప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారని చరణ్ పేర్కొన్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని, ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొంటూ పవన్‌ ని డాకర్ట్ పరీక్షిస్తోన్న ఫొటోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

More Related Stories