English   

మజిలీ త్రీ డేస్ కలెక్షన్స్ !

 Majili
2019-04-08 11:46:56

సమంత, నాగ చైతన్య, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా మజిలీ ఉగాది కానుకగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మజిలీ తొలి ఆట నుండే హిట్ టాక్‌ తో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ.7 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకు అది రూ.20 కోట్లకి చేరింది. ఇక ఫస్ట్ వీకెండ్‌ ముగిసే నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.32కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రూ.21కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. కథలో కొత్తదనం లేకున్నా టేకింగ్ నచ్చడంతో మజిలీ ఎక్కడా తగ్గట్లేదు. అదీ కాక ప్రస్తుతం పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో మజిలీకి ప్లస్‌ గా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ఊపు నడిస్తే ఈ సినిమా వారంలోనే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పంచే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.  

More Related Stories