English   

శోభన్ బాబు మళ్ళీ పుట్టాడా ? 

 Naga-Chaitanya
2019-04-08 12:49:02

అక్కినేని నాగ చైతన్య హీరోగా సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా వచ్చిన తాజా సినిమా మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వం వచించిన ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌ గా నిలిచింది. ప్రేక్షకులు సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు గాను చిత్ర యూనిట్ నిన్న థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మీట్‌లో హీరో నాగచైతన్య, హీరోయిన్స్ సమంత, దివ్యాంశ, శివ నిర్వాణ, నటులు రావు రమేష్, పోసాని కృష్ణమురళి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలు పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో సినిమాలో సమంతా తండ్రి పాత్ర పోషించిన పోసాని కృష్ణ మురళి నాగ చైతన్య మీద ప్రశంసల వర్షం కురిపించాడు. తనకు చైతన్య చిన్నప్పటి నుండి తెలుసని అతనితో రెండు సినిమాల్లో నటించానని అతను సెట్లో చాలా సైలెంట్ గా ఉంటాడని అన్నారు.  ఈ సినిమా చూశాక చైతు ఇంత గొప్పగా నటిస్తాడా ? అనే అసూయ, ఈర్శ్య కలిగాయని, శోభన్‌బాబు చైతు రూపంలో బ్రతికివచ్చాడా అనిపించిందని అంటూ చైతూను ఆకాశానికి ఎత్తేసాడు పోసాని. 

More Related Stories