English   

డియర్ కామ్రేడ్ ప్రేమ పాటలు !

  Dear-Comrade
2019-04-08 15:27:01

గీతగోవిందం సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించి రొమాంటిక్ జోడీగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ, రష్మికలు మళ్ళీ డియర్ కామ్రేడ్ కోసం పని చేస్తున్నారు. భరత్ కమ్మ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ కలిసి డియర్ కామ్రేడ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ఇటీవలే విడుదలై యూట్యూబ్‌ లో ఒక రేంజ్ లో వ్యూస్ తెచ్చుకుంది. వర్షంలో విజయ్, రష్మికల లిప్ కిస్ అయిర్గే ఈ టీజర్‌లో హైలైట్‌. మే 31న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు ఈ మూవీ నుండి మొదటి లిరికల్ సాంగ్‌ విడుదల చేశారు.  ‘నీ నీలి కన్నుల్లోని ఆకాశమే.. తెల్లారి అల్లేసింది నన్నే’.. అంటూ పల్లవితో ఉన్న ఈ సాంగ్‌ను గౌతమ్ భరద్వాజ్ పాడగా జస్టిన్ ప్రభాకరణ్ ఇచ్చిన అద్భుతమయిన ట్యూన్‌కి రెహ్మాన్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. ‘డియర్ కామ్రేడ్’ లో ఈ లిరికల్ సాంగ్ మీరు కూడా వినేయండి. 

More Related Stories