English   

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం...మేనత్త కామెంట్స్ !

 Jr-NTR
2019-04-08 16:13:34

ఎన్టీఆర్ కూతురిగా రాజకీయ రంగప్రవేశం చేసి ఒకప్పుడు కాంగ్రెస్ మినిస్టర్ గా సేవలందించి విశాఖపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పురందేశ్వరి తన మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అతనికి సినిమాల్లో మంచి భవిష్యత్ ఉందని, ఇప్పట్లో రాజకీయాల్లోకి రాకపోవచ్చని అన్నారు. కానీ ఒక వేళ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటే అతనికి రాజకీయ సలహాదారుగా ఉండటానికి తాను సిద్ధంగా ఉన్నానని పురందేశ్వరి ప్రకటించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని గతంలో తనతో చెప్పాడని, అందుకే తారక్ రాజకీయ జీవితం గురించి ఇప్పుడే చర్చించాల్సిన అవసరం లేదని ఇప్పట్లో రాజకీయాల్లోకి రాకపోవచ్చని అన్నారు. అంతేకాక తనకు సలహాదారుగా ఉండమని ఎన్టీఆర్ స్వయంగా అడగాలని, అంతే తప్ప ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం మాత్రం తాను చేయనని ఆమె పేర్కొన్నారు. 
 

More Related Stories