English   

శివాజీ రాజా మీద హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్ 

Hyper-Aadi
2019-04-08 16:24:12

జనసేన నుండి నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నాగబాబుకి ఓటు వేయొద్దని పేర్కొంటూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ కోరిన మా మాజీ అధ్యక్ష్యుడు శివాజీ రాజాకి కౌంటర్ ఇచ్చాడు జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది. పవన్ వీరాభిమానిగా మొదటు నుండి చెప్పుకునే ఆయన ప్రస్తుతం జనసేన తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న శివాజీ రాజా చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఓ వీడియోను రూపొందించి ఆయన మీద విరుచుకుపడ్డారు. ఈరోజు శివాజీ రాజాగారు ప్రెస్ మీట్ పెట్టి.. నాగబాబు గురించి ఏదో మాట్లాడారనీ ఆయన అంటే ఓ సీనియర్ నటుడిగా  గౌరవం ఉందనీ. కాని నాగబాబు గారి గురించి మీరు మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదనీ మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోండని ఆది కోరాడు. నాగబాబు పిల్లికి భిక్షం వేయడని అన్నారనీ నువ్ రెండు సంవత్సరాలు ‘మా’ ప్రెసిడెంట్‌గా చేశావ్. అది ఎవరు భిక్షం వేస్తే చేశావో ఆలోచించుకోవాలని ఆది పేర్కొన్నాడు. మా జబర్దస్త్ ఆర్టిస్ట్‌ఒకరికి కిడ్నీ ఫెయిల్ అయితే రూ. 10 లక్షలు సాయం చేశారనీ అలా అయన ఎంత మంది ఎన్ని సాయాలు చేశారో మీకు తెలుసా? అని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో కాని బయట కాని నాగబాబు గురించి ఒకటే మాట చెబుతారనీ ఆయన మంచి మనసున్న కల్మషం లేని మనిషి అని అది మీకు తెలిసి కూడా మీరు మా ఎన్నికల్లో ఓడిపోయారనే అక్కసుతో నాగబాబు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆది ఫైర్ అయ్యారు.

More Related Stories