English   

దిమాక్ ఖరాబ్ చేస్తున్న నిధి !

  Nidhhi-Agerwal
2019-04-08 16:37:32

చాన్నాళ్ళ నుండి హిట్స్ కోసం మొహం వాచి ఉన్న డైరెక్టర్ పూరీ, హీరో రామ్ లు ఇద్దరూ కలిసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ అనేది పోరీ స్టైల్ ట్యాగ్ లైన్. ఇటీవ‌లే గోవాలో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన యూనిట్‌. కాస్త విరామం తరవాత మళ్లీ ఈ మధ్యనే హైద‌రాబాద్‌ లో షూటింగ్ ప్రారంభించారు. ఈ  హైదరబాద్ షెడ్యూల్‌‌ను ‘దిమాక్ ఖరాబ్’ పాటతో మొదలుపెట్టారు. వందమంది డ్యాన్సర్లతో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను షూట్ చేస్తున్నారని సమాచారం. ఈ సాంగ్‌ కి నర్తిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్‌ ను తాజాగా విడుదల చేసింది సినిమా యూనిట్. చూడగానే కళ్ళు జిగేల్ మనిపించేలా ఉన్న నిధి లుక్‌ కు యూత్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ పాట చిత్రీకరణ జరుగుతుండగానే రెండ్రోజుల క్రితం దర్శకుడు సుకుమార్ సెట్స్‌కు వచ్చారు. సరికొత్త స్టైల్లో ఉన్న రామ్ లుక్‌ను, సాంగ్ మేకింగ్‌ను ప్రశంసించారని ఛార్మి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  

More Related Stories