English   

బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

Allu-Arjun
2019-04-08 16:51:11

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఈరోజు వరకూ మూడు సినిమాలు ప్రకటించారు. ఒకటి త్రివిక్రమ్ సినిమా కాగా మరొకటి లెక్క మాస్టర్ సుకుమార్ తో మరొకటి యాంగ్ డైరక్టర్ వేణు శ్రీ రామ్ తో. అయితే మూడు సినిమాలు ఒప్పుకున్నా మనోడు ముందు ఏ సినిమా పట్టాలు ఎక్కిస్తాడు అనే విషయం కాస్త ఆసక్తికరంగా ఉండేది. ఈరోజు అయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి ఆ డౌట్ కూడా క్లారిఫై చేసేసారు. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లోని సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ రోజున అల్లు అర్జున్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ విషయాన్ని ప్రకటించారు. అల్లు అర్జున్ కి ఇది లెక్క ప్రకారం 19వ సినిమా. ఇక ఈ సినిమాని హారిక అండ్ హాసిని అలాగే గీతా ఆర్ట్స్ ఇద్దరూ కలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కధానాయక అనుకుంటున్నారు కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

More Related Stories