English   

చిత్రలహరి సెన్సార్ టాక్ !

  Chitralahari
2019-04-08 17:08:40

సాయి ధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటిస్తున్న సినిమా చిత్రలహరి. ఈ సినిమాకి నేనుశైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకుడిగా వ్యవహరించాడు. ఇక అరడజను సినిమాలు ఫ్లాప్స్ రావడంతో ఈ సినిమా మీదే తేజ్ కెరీర్ ఆధార పడి ఉంది. అయితే ఈ దర్శకుడికి ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరుంది. ఇది కూడా ప్రేమ కధా చిత్రం కావడంతో ఈ సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఈ నెల 12వ తేదీన అంటే ఎన్నికలు అయిన తెల్లవారే ఈ సినిమా థియేటర్ల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను అందించారు. అయితే ఈ సినిమాలో ఎక్కడా ఒక కట్ కూడా పడకుండా ఈ సినిమా సెన్సార్ అయిందని చెబుతోంది సినిమా యూనిట్.  సినిమా చాల బాగా వచ్చిందని  తేజ్ కు ఈ సినిమాతో ఫ్లాప్ లు తెరపదినట్టే అని సెన్సార్ అధికారులు చెప్పారట. దీంతో సంబరాల్లో మునిగిపోయిందట సినిమా యూనిట్. ఈ సినిమాలో శాయి స్నేహితుడి పాత్రలో సునీల్ కనిపించనున్నాడు. ఈ సినిమాతో కమెడియన్ గా సునీల్ మళ్లీ బిజీ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సాయికి మాత్రమే కాదు ఈ సినిమా సునీల్ కి కల్యాణి ప్రియదర్శన్ కి, నివేదాకి మూవీ మేకర్స్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమనే చెప్పాలి.

More Related Stories