English   

హిందీ అర్జున్ రెడ్డి వస్తున్నాడు !

kabir-singh
2019-04-09 08:59:43

ఓవర్ నైట్ లో విజయ్ దేవరకొండను హీరో నుండి సెన్సేషనల్ స్టార్‌ను చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాను ప్రస్తుతం హిందీలో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డే ఈ సినిమాని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు. కబీర్ సింగ్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా భరత్ అనే నేను హీరోయిన్ కైరా అద్వానీ హీరోయిన్‌ గాను నటిస్తున్నారు. విడుదలకి దగ్గరపడుతున్న నేపధ్యంలో ఈ సినిమా టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ‘అర్జున్ రెడ్డి’ని యాజిటీజ్ దించేశారనిపిస్తోంది. షాహిద్ కపూర్ విజయ్ నే జ్ఞాపకం తెప్పిస్తున్నాడు. కాకపోతే, తెలుగు టీజర్‌తో పోలిస్తే హిందీ టీజర్ ఇంకొంచెం బాగుంది. ఇక మొత్తం టీజర్ తెలుగులో ఉన్నట్లే ఉంది. తెలుగు టీజర్‌లో వివాదాస్పదమైన మాదర్....అనే బూతును కూడా హిందీలో పెట్టారు. మరి ఈ టీజర్ ను మీరు కూడా చూడండి మరి.

More Related Stories