English   

వర్మ కోబ్రా...నయీం బయోపిక్కా ?

Ram Gopal Varma to make his acting debut with Cobra
2019-04-09 09:44:51

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు మెగా ఫోన్ పట్టుకుని డైరెక్షన్ చేస్తూ తెరవెనుకే ఉండిపోయాడు. అయితే ఇప్పుడు తానే స్వయంగా నటిస్తున్న సినిమా కోబ్రా. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ మీద డి.పి.ఆర్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిన్న వర్మ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.  ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై ప్రచురించిన కొన్ని వాక్యాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘వాడిని కానీ అరెస్ట్ చేస్తే, సగం పోలీస్ డిపార్ట్‌మెంట్ జైల్లోకెళ్తుంది’ అని ప్రచురించారు. అంటే ఈ మోస్ట్ డేంజరెస్ క్రిమినల్‌తో సగం పోలీసులకు సంబంధాలున్నాయని వర్మ చెప్పకనే చెబుతున్నారు. అయితే ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నయీం బయోపిక్‌ అని స్పష్టమవుతోంది. వర్మ చేసిన ట్వీటే ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ‘రౌడీ షీటర్‌గా ఉన్న ఒక వ్యక్తి నక్సలైట్‌గా మారి ఆ తరవాత పోలీస్ కోవర్ట్ ఏజెంట్‌గా మారి గ్యాంగ్ స్టర్ అయ్యాడు. దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ మాదిరిగానే బ్రాండ్ నేమ్స్‌తో నేర ప్రపంచాన్ని ఈ కోబ్రా శాసించాడు. అతను చనిపోయేంత వరకు చేసిన అరాచకాలు ఎవ్వరికీ తెలియదు’ అని వర్మ ట్వీట్ చేశారు. ఈ వివరాలను బట్టి కచ్చితంగా ఇది నయీం బయోపిక్ అనే అర్థమవుతోంది. ఈ సినిమాలో సీఎం కేసీఆర్ పాత్ర కూడా ఉండడం దీనికి ఊతం ఇస్తోంది. 

More Related Stories