English   

తెలుగు నేర్చుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ !

aliabhatt
2019-04-09 10:10:26

జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌. క్రేజీ కాంబినేషన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన నటిస్తోంది. ఈ పాత్ర కోసం తెలుగు నేర్చుకోవడానికి సిద్ధమైందట ఆలియా. ఇందుకోసం ట్యూటర్‌ను కూడా నియమించుకున్నట్లు తెలిపింది ఈ బాలీవుడ్ భామ. ఎన్టీఆర్‌, రాంచరణ్‌ హీరోలుగా రూపొందుతోన్న ఈ మల్టీస్టారర్‌లో రాంచరణ్‌ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తుంటే ఆయనకు జోడిగా అలియా భట్‌ నటించనున్నారు. తెలుగు బాష నేర్చుకోవడం చాలా కష్టంగా ఉదని అయినా సరే తెలుగు అన్నీ భావాలను పలికించే చక్కని భాష. ఆ పదాలను ఎందుకు పలుకుతున్నారు? అర్థమేంటి? అనే విషయాలను తెలుసుకుంటున్నానని అప్పుడే పాత్రకు న్యాయం చేయగలుగుతానని ఆమె పేర్కొంది. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కరణ్‌జోహార్‌, సంజయల్‌ లీలా భన్సాలి, రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలనుకున్నానని కరణ్‌ జోహార్‌ గారు హీరోయిన్‌గా పరిచయం చేసేసారని ఇప్పుడు భన్సాలి గారితో రాజమౌళి గారితో పనిచేస్తున్నానని చెప్పుకొచ్చింది అలియా భట్‌. 

More Related Stories