English   

అలీ మోసం చేశాడన్న పవన్....కౌంటర్ ఇచ్చిన అలీ !

YSRCP Leader Ali Strong Counter To Pawan Kalyan
2019-04-09 10:58:15

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే మాట ఎవరు కనిపెట్టారో కానీ మన రాజకీయ నాయకులు దానిని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. నిన్న రాజమండ్రిలో జరిగిన సభలో ప్రాణం లాంటి స్నేహితుడు అలీ రాజకీయ ఎదుగుదల కోసం తననీ మోసం చేశాడని పవన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అలీ తనకు మిత్రుడైనా వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో చేతులు కలిపారని అలీ తెచ్చి పరిచయం చేసిన వాళ్ళ బామ్మరిదికి జనసేన తరపున టిక్కెట్‌ ఇచ్చినా అలీ తనను వదిలి వెళ్లారని, మోసం చేశాడని ఆవేదన వ్యక్తంచేశారు. అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని తనతో కలిసి పనిచేస్తానని చెప్పి ఇప్పుడు చెప్పా పెట్టకుండా వైసీపీలోకి వెళ్లిపోయారని పవన్ అన్నారు. అలీ లాంటివాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని వ్యాఖ్యానించారు. అలీ స్వస్థలం రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలకు అలీ కౌంటర్ ఇచ్చారు. అయితే తనను పవన్ ఎప్పుడు జనసేనలోకి ఆహ్వానించలేదని నేను కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని పవన్ అన్నారు. మీరు నాకు ఎలా సాయం చేశారు పవన్ సార్? నాకేమైనా డబ్బులిచ్చారా? లేదంటే సినిమాల్లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే అవకాశాలు ఇప్పించారా? అని అలీ ప్రశ్నించారు. పవన్ సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే తాను మంచి పొజిషన్లో ఉన్నానని ఆర్థిక సాయం చేయాలని ఎవర్నీ ఏనాడూ అడగలేదని ఆకలితో చస్తాను తప్పితే వెళ్లి ఎవర్నీ అడగనని అన్నారు. పవన్‌పై తాను ఎలాంటి కామెంట్లు చేయనప్పటికీ తన మీద సొంత ఊరిలో పవన్ ఆరోపణలు చేయడం బాధించిందని అన్నారు. 

More Related Stories