English   

దర్బార్ ఫస్ట్ లుక్ ! 

Darbar first poster out
2019-04-09 11:18:04

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 167వ మురగదాస్ తో ఉండనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. దర్బార్ పేరుతో ఉన్న సినిమా ఫస్ట్ లుక్ ని పరిశీలిస్తే గనుక హీరో వెనుక గెట్ వే ఆఫ్ ఇండియా, ముంబై మ్యాప్, గన్లు, పోలీస్ టోపీ, పోలీస్ బెల్ట్ ఇవన్నీ చూస్తుంటే ఆయన పోలీస్ పాత్రలో నటించనున్నారని చెబుతున్నారు. ఎ.ఆర్‌.మురుగదాస్‌ డైరెక్ట్‌ చేయబోయే ఈసినిమాలో నయనతార కథానాయకగా నటించనుంది. మొత్తం మీద ఈ సినిమా ముంబై నేపధ్యంలోనే సాగనుందని అర్ధం అవుతోంది. మరి మురగదాస్ ఏమి మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి

More Related Stories