English   

ప్రైవేట్ పార్టీలో మెరిసిన స్టార్ హీరోలు !

Jr NTR And Mahesh Babu Family at Malini Paidipalli Birthday Party
2019-04-09 11:34:35

సినిమా వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే కొట్టుకు చస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మహేష్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఒక రేంజ్ లో యుద్ధం జరుగుతోంది. ఏకంగా ఒకరి హీరో మార్ప్గింగ్ పిక్స్ తో మరొకరు అసభ్యంగా కూడా తిట్టుకుంటున్నారు. అయితే ఇదంతా తిన్నది అరగక చేసే పని అన్నట్టు చెంప దెబ్బ కొట్టిన్నట్టు సమాధానం ఇచ్చారు ఈ ఇద్దరు హీరోలు. ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక ప్రైవేట్ ఈవెంట్ లో సమయం గడిపారు. విషయం ఏంటంటే దర్శకుడు వంశీ పైడిపల్లి భార్య మాలిని పుట్టినరోజు వేడుక నిన్న రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీకి మహేష్‌బాబు, ఎన్టీఆర్ భార్యలతో కలిసి హాజరయ్యారు. ఈ పార్టీలో తీసుకున్న ఫొటోలను మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.  గతేడాది జూలైలో కూడా వంశీ పుట్టినరోజు వేడుకలో మహేష్‌బాబు, ఎన్టీఆర్ పాల్గొన్నారు. అయితే అప్పుడు వీరిద్దరితోపాటు రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఈసారి చరణ్ మాత్రం హాజరుకాలేదు. 

More Related Stories