English   

నాని సినిమా చైనాలో కూడా రిలీజ్ చేస్తారట !

Nani
2019-04-09 16:39:26

నాని హీరోగా మళ్ళీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా జెర్సీ. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ మీద హారికా హాసినీ సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాని తన తండ్రితో సంబంధం లేకుండా నిర్మిస్తున్నారు. శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను చేస్తుంది యూనిట్. ఈ క్రమంలో నిన్న నాని, నిర్మాత వంశీ మీడియా ముందుకు వచ్చారు. జెర్సీ ట్రైలర్ ఏప్రిల్ 12 ఉదయం 9 గంటలకు విడుదల కాబోతోందని, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 15న ప్లాన్ చేసినట్లు రిలీజ్ మాత్రం ఏప్రిల్ 19న ఖచ్చితంగా అవుతుందని వారు చెప్పుకొచ్చారు. క్రికెట్ లో తన గోల్ రీచ్ అవడానికి 30 ఏళ్ల తర్వాత కూడా హీరో ఎంత కష్టపడ్డాడు అన్నదే జెర్సీ కథ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాను చైనాలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అయితే నిజానికి చైనాలో క్రికెట్ ఆడరు చూడరు మరి అక్కడ ఎందుకు అంటారా ?  జెర్సీ యూనివర్సల్ కాన్సెప్ట్ అని ఎక్కడైనా చూస్తారని అనున్నారు. చైనాలో రిలీజ్ చేస్తే పెద్ద ఎత్తునే రిలీజ్ చేస్తామని ప్రస్తుతానికి అంత సమయం లేకపోవడంతో తెలుగులో చేసేసి ఆ తర్వాత సమయాన్ని బట్టి చైనీస్ లోకి డబ్ చేస్తారని అంటున్నారు.

More Related Stories