English   

పవన్ కోసం పాలకొల్లు వెళ్ళిన అల్లు అర్జున్ !

 AlluArjun
2019-04-09 16:57:15

ఎట్టకేలకు జనసేన కార్యర్తలకు కొంతలో కొంత బాధ తీరినట్టు అయ్యింది. ఇటీవలే బాబాయ్ కి ఆరిగ్యం బాలేదని పరామర్శించిన చరణ్ కొంత బాసటగా నిలిస్తే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పవన్ వెన్నంట నిలిచాడు. ఇప్పటికే నాగబాబు కొడుకు వరుణ్‌ తేజ్‌, కూతురు నీహారికలు ఆయన కోసం రోడ్‌ షో నిర్వహించారు. ఇక ఈరోజు ఏకంగా అల్లు అర్జున్‌ పవన్‌ ప్రసంగిస్తోన్న వేదికపైకి ఎక్కి జనసేన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. పాలకొల్లులో ఎన్నికల ప్రచారం చివరి రోజున పవన్‌ సభలో అల్లు అర్జున్‌ పవన్ పక్కనే నిలబడ్డాడు. నిజానికి మెగా హీరోలు అందరూ పవన్ కు బాసటగా ముందు నుండే ప్రకటనలు చేశారు. అయితే ఏమయిందో ఏమో కానీ ఎవరూ ప్రచారానికి రాలేదు. అయితే పవన్ ఆరోగ్యం దెబ్బ తిన్న వెంటనే అందరూ ఆయనకు అండగా నిలిచేందుకు వెంట నిలిచారు.
 

More Related Stories