English   

శివ నిర్వాణకి డబుల్ బొనంజా !

Shiva-Nirvana
2019-04-09 17:46:25

నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. అయన రెండో సినిమాగా మజిలీని తెరకెక్కించారు. నాగచైతన్య కెరీర్‌ లోనే ఇది బెస్ట్ సినిమా అన్నట్టుగా సినిమా ఆడుతోంది. రెండో సినిమా హిట్ తోనే ఆయన ఆనందంలో ఉండగా అయన సంతోషాన్ని రెట్టింపు చేసే విషయం ఒకటి ఆయన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంది. తాజాగా తనకు పండంటి మగబిడ్డ జన్మించినట్టు శివ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయన ట్వీట్ ప్రకారం ‘ఇటీవలే నాకు కొడుకు పుట్టాడు. నా మజిలీలో ఒక బుజ్జి మలుపు. ఇంతకు మించి ఇంకేమీ అడగొద్దు’ అని శివ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొన్నారు. అంటే, శివకు ఇది డబుల్ బొనంజా అన్న మాట. అయితే కొడుకు వచ్చాక హిట్ వచ్చిందో హిట్ వచ్చాక కొడుకు పుట్టాడో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కానీ బుడ్డోడి ఫోటో ప్రకారం చూస్తే ముందే పుట్టినట్టు భావిస్తున్నారు.  

More Related Stories