English   

మోహన్ బాబు దౌర్జన్యం !...కోర్టును ఆశ్రయించిన వైవీఎస్ !

YVS-Chowdary
2019-04-09 18:31:54

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు చెక్ బౌన్స్ కేసులో హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. అంతే కాక 41.75 లక్షల జరిమానాను కూడా విధించింది. గతంలో సినీ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి.. మోహన్ బాబుపై ఈ చెక్ బౌన్స్ కేసు వేశారు. 2010 సంవత్సరంలో ఈ అంశానికి సంబంధించి కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే తాజాగా ఈ కేసు విషయమై ఎర్రమంజిల్ 23 కోర్టు జడ్డి వి. రఘునాథరావు తీర్పు వెలువరించారు. ఈ క్రమంలో మోహన్‌ మీడియా ముందుకు వచ్చిన మోహన్ బాబు సదరు న్యాయసానాన్ని వైవీఎస్ చౌదరి తప్పుదోవ పట్టించినట్లు ఆరోపించారు. నిజానికి వైవిఎస్‌ చౌదరి శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్ లో మోహన్‌బాబు నిర్మించిన, సలీమ్‌ అనే సినిమాకి డైరెక్షన్ చేసినందుకు గాను కొంత మొత్తం వైవీఎస్ కి ఇచ్చారు. మరి కొంత ఇవ్వాల్సి ఉండగా దాని నిమిత్తం ఒక చెక్ వైవీఎస్ కి ఇచ్చారు. అయితే అయన దానిని బ్యాంక్ లో వేయగా అది బౌన్స్ అయింది. ఆ విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించగా దాదాపు 9 సంవత్సరాల తర్వాత మొన్ననే వైవీస్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ విషయంలో మోహన్ బాబు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ తనను బాధించాయని పేర్కొంటూ వైవీఎస్ చౌదరి ఒక ప్రకటన విడుదల చేశారు. మోహన్‌ బాబు‌ జల్‌పల్లి గ్రామంలో నివసిస్తున్న ఇంటిని ఆనుకొని, నా ఇంటి నిర్మాణానికై 'సలీమ్‌' చిత్ర నిర్మాణ సమయంలోనే నేను కొనుక్కున్న అర ఎకరం స్థలంలోకి చెక్‌ బౌన్స్‌ కేసు కోర్టు తీర్పు వైవీఎస్ ని ఆయన మనుషుల్ని వారి స్థలంలోకే రానీకుండా అడ్డుకోవడంతో మళ్ళీ కోర్టుకు ఎక్కాడు వైవీస్ చౌదరి. ఆయన తరపున అయన లాయర్లు లీగల్ నోటీసులు కూడా పంపారు. 

More Related Stories