English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో కూడానట !

Lakshmis-NTR
2019-04-09 18:46:03

వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోనికి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన నాటి నుండి జరిగిన సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు, ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం గత నెల 29న రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మీద స్టే కోరుతూ ఏపీ కోర్టుల్లో టీడీపీ నేతలు కేసులు వేయడంతో ఈ సినిమా ఎన్నికలు అయ్యేదాకా ఆపాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమాని ఏపీ మినహా అన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేశారు. చాన్నాళ్ళ తర్వాత వర్మ నుండి కాస్త ఇంటరెస్టింగ్ సినిమా రావడంతో సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి. అయితే తొలుత ఈ నెల 3న సినిమా చూసి రిలీజ్ గురించి మాట్లాడతామని హైకోర్టు పేర్కొంటే నేనెందుకు అప్పటిదాకా ఆగాలి అంటూ వర్మ సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. అక్కడ కూడా ఆగమనే సమాధానం వచ్చింది. అయితే మరి ఏమయిందో ఏమో గానీ కొద్దిసేపటి క్రితం వర్మ ట్విట్టర్ నుండి ఈ సినిమా త్వరలో ఏపీలో విడుదల అంటూ ఒక పోస్టర్ వదిలారు,.  కోర్టు ఏమైనా ఆదేశాలు ఇచ్చిందో లేక వర్మ కావాలనే ఏమైనా చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ ఒకరి రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అయినా దాని వలన టీడీపీకి వచ్చే నష్టం ఉండదు. మరి వర్మ ఎందుకు ఇప్పుడు పట్టుబట్టి రిలీజ్ చేస్తున్నాడో మరి.

More Related Stories