English   

బుల్ రెడ్డి వీడియోతో వస్తుందట పాయల్ !

payal rajput bull reddy video song release on april 10th
2019-04-10 07:18:33

‘రెడ్డిగారి కుర్రాళ్లిట్ట.. రెచ్చిపోతే ఎట్టాగంట..’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా దర్శకుడు తేజ తెరకెక్కించిన సీత సినిమాలో పాయల్‌ ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. తాజాగా ఈ పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ‘బుల్లెట్‌ మీదొచ్చె బుల్‌ రెడ్డి.. యమహా ఏసుకొచ్చె యాదిరెడ్డి..’ అంటూ సాగుతున్న ఈ పాట మాస్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాట కోసం సినిమాకు వెళ్దామని కొందరు అనుకుంటున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ పాత క్రేజ్ ఎలా ఉందో. అయితే ఈ క్రేజ్ ని మరింత పెంచి సినిమా కోసం వాడుకోవాలని చూస్తున్న సినిమా యూనిట్ ఈ పాటకు సంబందించిన వీడియో సాంగ్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు సినిమా యూనిట్. రేపు ఉదయం పదిన్నరకి ఈ వీడియో సాంగ్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

More Related Stories