English   

కల్కి టీజర్ టాక్ !

kalki
2019-04-10 13:33:20

ఆ సినిమాతో సత్తా చాటుకున్న ప్రశాంత్ వర్మ తాజా తెరకెక్కిస్తున్న సినిమా కల్కి. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన ఆదా శర్మ, నందిత శ్వేత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు. యాక్షన్, ఎమోషన్ తో కూడిన సన్నివేశాలతో ఈ టీజర్ ను కట్ చేశారు. రాజశేఖర్ కి ఇప్పుడు మార్కెట్‌ లేదు, అయితే ఆయన సినిమా మాత్రం భారీ బడ్జెట్ తోనే తెరకేక్కిస్తున్నారు. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఈ టీజర్ ను కట్ చేయడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. గతంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాల్లో చాలా వరకూ భారీ విజయాలను సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో రాజశేఖర్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.

More Related Stories